Sunder Pichai: లైంగిక వేధింపుల నిరోధానికి చర్యలు తీసుకుంటాం: సుందర్ పిచాయ్

  • సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నాం
  • గతంలో సరిగ్గా వ్యవహరించనందుకు క్షమాపణ
  • వ్యవస్థలో మార్పులను కచ్చితంగా తీసుకొస్తాం

లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉన్నత ఉద్యోగుల విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోకుండా పక్షపాతంగా వ్యవహరించారని గత వారం గూగుల్ ఉద్యోగులు ప్రపంచ వ్యాప్తంగా 20 వేల మంది వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించారు. ఈ మేరకు ఆయన తమ సంస్థ ఉద్యోగులకు ఒక లేఖ రాశారు.

లైంగిక వేధింపులు, దాడుల నిరోధానికి సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. గతంలో సరిగ్గా వ్యవహరించనందుకు ఉద్యోగులను క్షమాపణ కోరారు. వ్యవస్థలో మార్పులను కచ్చితంగా తీసుకొస్తామని తెలిపారు. అప్పట్లో అనుసరించిన విధానాలను మార్చేస్తామని.. ఉద్యోగుల అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. పని ప్రదేశంలో మర్యాదకర వాతావరణం ఉండేలా చూస్తామని సుందర్ పిచాయ్ లేఖలో వెల్లడించినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థ ఒకటి తెలిపింది.

Sunder Pichai
Sexual Harassment
Google
International News Agency
  • Loading...

More Telugu News