Vishnu kumar Raju: భూ కుంభకోణంపై సిట్ పూర్తి నివేదికను బయటపెట్టాలి: విష్ణుకుమార్ రాజు
- తమ పేరుపై భూములు ఉంచుకోరు
- బినామీల పేరు మీదే ఉంటాయి
- సిట్ నిజాయితీగానే రిపోర్ట్ ఇచ్చింది
విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగిందని.. మడపాకలో 500 ఎకరాలు, మధురవాడలో 350, గండిగుండంలో 183 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని ఏపీ బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. రాజకీయ నేతలెవరూ తమ పేరుపై భూములు ఉంచుకోరని.. బినామీల పేరు మీదే ఉంటాయని కాబట్టి వాటిని క్లీన్ చిట్‌గా భావించలేమన్నారు.
భూ కుంభకోణంపై సిట్ నిజాయితీగానే రిపోర్ట్ ఇచ్చిందని.. ఆ రిపోర్టును ప్రభుత్వం 9 నెలల పాటు తమ వద్దే ఉంచుకుని.. ఇప్పుడు కొన్ని భాగాలను బయటపెట్టడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుకి లేఖ రాసిన విష్ణు కుమార్‌రాజు.. పూర్తి నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అన్యాక్రాంతమైన భూముల్ని వెనక్కి తీసుకోవాలని సిట్ చెప్పింది తప్ప.. అన్యాక్రాంతమైన ప్రైవేటు భూముల విషయమై ప్రస్తావించలేదని ఆయన అన్నారు.