Karne Prabhakar: తెలంగాణ ప్రజల దెబ్బకు టీటీడీపీ నేతలు దూదిపింజల్లా కొట్టుకుపోవడం ఖాయం: కర్నె ప్రభాకర్

  • హరీశ్ ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థితిలో చంద్రబాబు లేరు
  • తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగానే పనిచేస్తామన్నారు
  • ఏపీ ప్రయోజనాలకు అనుగుణంగా మాటలు మారుస్తున్నారు

తెలంగాణ ప్రజల దెబ్బకు ఈ ఎన్నికల్లో టీటీడీపీ నేతలు దూది పింజల్లా కొట్టుకుపోవడం ఖాయమని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. నేడు హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్ ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థితిలో ఏపీ సీఎం చంద్రబాబు లేరన్నారు.

టీటీడీపీ నేతలు కూడా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగానే పనిచేస్తామని తెలిపారని పేర్కొన్నారు. ఏపీ ప్రయోజనాలకు అనుగుణంగా టీటీడీపీ నేతలు మాటలు మారుస్తున్నారని ప్రభాకర్ విమర్శించారు. కొన్ని సీట్ల కోసం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని.. టీటీడీపీ నేతలు ఇంకా బానిస మనస్తత్వాన్ని వీడటం లేదని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో ఉంటూ చంద్రబాబు కోవర్టులుగా పనిచేస్తామని మండవ వెంకటేశ్వరరావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి చెప్పారని ప్రభాకర్ ఆరోపించారు.

Karne Prabhakar
Chandrababu
Harish Rao
Mandava venkateswara Rao
Revuri Prakash Reddy
  • Loading...

More Telugu News