Harish Rao: 48 గంటల్లో వివరణ ఇవ్వండి: హరీష్ రావుకు ఈసీ నోటీసులు

  • చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు
  • రేవంత్, వంటేరు, రేవూరిలకు కూడా నోటీసుల జారీ
  • కేసీఆర్ ను, మంత్రులను దూషించినందుకు వివరణ ఇవ్వాలంటూ ఆదేశం

టీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, 48 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ హరీష్ కు ఈసీ నోటీసులు ఇచ్చింది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, టీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ నేతలను దూషించడంపై వీరి నుంచి వివరణ కోరింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Harish Rao
Chandrababu
kcr
Revanth Reddy
revuri
vanteru
ec
notice
  • Loading...

More Telugu News