sarkar: ‘సర్కార్’ సెగలు.. అరెస్ట్ వార్తలపై స్పందించిన దర్శకుడు మురుగదాస్!

  • నిన్న రాత్రి నా ఇంటికి పోలీసులు వచ్చారు
  • చాలాసార్లు తలుపులు తట్టారు
  • ట్విట్టర్ లో స్పందించిన దర్శకుడు

ఇళయ దళపతి విజయ్, కీర్తి సురేశ్ జంటగా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘సర్కార్’ సినిమా రాజకీయ దుమారం లేపుతోంది. ఈ సినిమాలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితతో పాటు ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై విమర్శనాత్మకంగా ఉన్న సీన్లను తీసేయాలని మంత్రులు, అన్నాడీఎంకే నేతలు డిమాండ్ చేస్తున్నారు. సర్కార్ ఆడుతున్న థియేటర్ల దగ్గర అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళనలు చేపడుతున్నాయి. తాజాగా నిన్న అర్ధరాత్రి దర్శకుడు మురుగదాస్ ను అరెస్ట్ చేసేందుకు తమిళనాడు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.

ఈ మేరకు సర్కార్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్’ ట్వీట్ చేసింది. దీంతో ఈ వ్యవహారంపై మురుగదాస్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘పోలీసులు నా ఇంటికి రాత్రిపూట వచ్చి తలుపులు చాలాసార్లు కొట్టారు. కానీ నేను ఇంటిలో లేకపోవడంతో వెళ్లిపోయారు. ఇప్పుడు నా ఇంటి ముందు పోలీస్ అధికారులెవరూ లేరు’ అని మురుగదాస్ నిన్న రాత్రి ట్వీట్ చేశారు. స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నవంబర్ 6న విడుదల అయింది.

sarkar
kollywood
jayalalitha
Chief Minister
objectional scenes
remove
sun pictures
ar murugadoss
director
vijay
movie
Police
arrest
response
  • Loading...

More Telugu News