New Delhi: దీపావళి షాపింగ్ కు తీసుకెళ్లలేదని స్నేహితుడిని కత్తితో పొడిచి చంపిన యువకుడు!

  • ఢిల్లీలోని జహంగీర్ పురిలో ఘటన
  • దీపావళి షాపింగ్ కు వెళ్లిన దీపక్
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

తనను దీపావళి షాపింగ్ కు తీసుకెళ్లలేదన్న అక్కసుతో ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. పక్కింటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. ఢిల్లీలో నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దేశ రాజధానిలోని జహంగీర్ పురిలో యోగేశ్ అనే యువకుడు ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో పక్కింట్లో ఉంటున్న దీపక్ తో అతనికి స్నేహం ఏర్పడింది. అయితే దీపావళి పండుగ సందర్భంగా దీపక్ షాపింగ్ కు బయలుదేరాడు. దీంతో తాను కూడా వస్తానని యోగేశ్ చెప్పగా దీపక్ నిరాకరించాడు. దీంతో ద్వేషం పెంచుకున్న యోగేశ్ దీపక్ ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. నిన్న రాత్రి 11.40 గంటలకు ఇద్దరు కలిసి బైక్ పై షికారుకు బయలుదేరారు.

ఈ నేపథ్యంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో యోగేశ్ దీపక్ ను కిరాతకంగా పొడిచి హతమార్చాడు. అనంతరం ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న దీపక్ ను గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. దీపక్ ను అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యోగేశ్ ను కటకటాల వెనక్కు నెట్టారు.

New Delhi
diwali
deepawali
friend
attacked
by
knife
shopping
Police
arrest
case
angry
  • Loading...

More Telugu News