Mahesh Babu: క్రిష్ దర్శకత్వంలో మహేశ్ బాబు .. నిర్మాతగా అల్లు అరవింద్!

  • 'మహర్షి'తో బిజీగా మహేశ్ 
  • తదుపరి సినిమా సుకుమార్ తో 
  • అల్లు అరవింద్ నిర్మాతగా మరో సినిమా

ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు 'మహర్షి' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో మహేశ్ బాబు ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలోనే సుకుమార్ బిజీగా వున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మహేశ్ బాబు మరో సినిమాను కూడా పట్టాలెక్కించనున్నట్టు సమాచారం.

అల్లు అరవింద్ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా పేరు వినిపించింది. కానీ తాజాగా క్రిష్ పేరు తెరపైకి వచ్చింది. ఒక వైపున సాంఘిక చిత్రాలతోపాటు మరో వైపున చారిత్రక చిత్రాలతోను క్రిష్ తన సత్తా చాటుకుంటున్నారు. ఆయన చేతికి మహేశ్ ప్రాజెక్టును అల్లు అరవింద్ అప్పగించనున్నట్టుగా చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

Mahesh Babu
allu aravind
krish
  • Loading...

More Telugu News