Telugudesam: 16 సీట్లు ఆశిస్తున్న టీటీడీపీ.. నేటి సమన్వయ కమిటీ సమావేశంలో చర్చ

  • పద్దెనిమిది సీట్లు కోరిన తెలుగుదేశం
  • పద్నాలుగు సీట్లు కేటాయించిన కాంగ్రెస్‌
  • మరో రెండైనా ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం

తెలంగాణ ఎన్నికల్లో తనవంతు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ కనీసం 16 స్థానాల నుంచైనా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. మహాకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా పార్టీ పద్దెనిమిది సీట్లు ఆశించింది. కాంగ్రెస్‌ పద్నాలుగు సీట్లు మాత్రమే కేటాయించింది. దీంతో ఈరోజు జరిగే సమన్వయ కమిటీ సమావేశంలో అదనపు సీట్లు సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారు.

ముఖ్యంగా మరో రెండు సీట్లయినా ఇవ్వాలని పట్టుబట్టేందుకు అధినాయకత్వం సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో గెల్చుకున్న స్థానాలపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడకూడదని బావిస్తున్నారు. సీట్లు తమకే కేటాయిస్తారన్న ఆశతో ఇప్పటికే చాలా మంది పార్టీ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. సనత్‌నగర్‌ టికెట్‌ ఆశిస్తున్న కూన వెంకటేశ్‌ గౌడ్‌ అయితే ఐదు డివిజన్లలో ఇప్పటికే రెండుసార్లు పర్యటన పూర్తి చేశారు.

Telugudesam
assembly tickets
meet today
  • Loading...

More Telugu News