baidaiversity flyower: బయోడైవర్సిటీ కూడలిలో ట్రాఫిక్‌ కష్టాలు కొలిక్కి.. మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ ప్రారంభం నేడు!

  • ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికారులు
  • రూ.108.59 కోట్లతో వంతెన నిర్మాణం
  • రాడిసన్‌-ఇనార్బిట్‌మాల్‌ రోడ్లను కలుపుతూ నిర్మాణం

హైదరాబాద్‌ మహా నగర వాసులను ట్రాఫిక్‌ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు నిర్మించిన మరో ఫ్లై ఓవర్‌ వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. రాడిసన్‌-ఇనార్బిట్‌ మాల్‌ రోడ్లను కలుపుతూ 108.59 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన వంతెనను ఈరోజు ప్రారంభించనున్నారు.

ఈ వంతెన అందుబాటులోకి వస్తే బయోడైవర్సిటీ కూడలిలో ట్రాఫిక్‌ కష్టాలు పూర్తిగా తీరుతాయని భావిస్తున్నారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ కష్టాల నుంచి గట్టెక్కేందుకు వ్యూహాత్మక రోడ్ల నిర్మాణంలో భాగంగా ఈ వంతెనను నిర్మించారు. ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిషోర్ లు ఈ వంతెనను ప్రారంభించనున్నారు.

  • Loading...

More Telugu News