Lagadapati Rajagopal: పారిశ్రామికవేత్త జీపీ రెడ్డి నివాసంలో అర్ధరాత్రి సోదాలు.. పోలీసులను అడ్డుకున్న లగడపాటి

  • గురువారం అర్ధరాత్రి సోదాలకు వచ్చిన పోలీసులు
  • అనుమతి లేకుండా సోదాలేంటని అడ్డుకున్న లగడపాటి
  • ఐజీ నాగిరెడ్డి బెదిరింపులకు గురిచేస్తున్నారన్న మాజీ ఎంపీ

ప్రముఖ వ్యాపారవేత్త జీపీ రెడ్డి నివాసంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేగింది. హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 65లో ఉన్న ఆయన నివాసంలో సోదాలకు వచ్చిన పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

 ఎటువంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి సోదాలు ఏంటంటూ పోలీసులపై లగడపాటి మండిపడ్డారు. ఐజీ నాగిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. భూమి విషయంలో తన మిత్రుడైన జీపీ రెడ్డిని బెదిరింపులకు గురిచేస్తున్నారని, అర్ధరాత్రి ఈ సోదాలేంటని ప్రశ్నించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

Lagadapati Rajagopal
Hyderabad
GP Reddy
Police
  • Loading...

More Telugu News