taliban: చరిత్రలో తొలిసారి.. రేపు తాలిబన్లతో చర్చలు జరుపనున్న ఇండియా

  • పలు దేశాలు, తాలిబన్లతో సమావేశాన్ని నిర్వహిస్తున్న రష్యా
  • తాలిబన్లతో అనధికార చర్చలు జరపనున్న భారత్
  • ఆఫ్ఘాన్ లో శాంతిని నెలకొల్పేందుకు సహకరిస్తామన్న విదేశాంగ శాఖ

దేశ చరిత్రలోనే తొలిసారి తాలిబన్ ఉగ్రవాదులతో భారత్ చర్చలు జరపబోతోంది. రష్యా రాజధాని మాస్కోలో తాలిబన్లతో రేపు అనధికారిక చర్చలు జరగనున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ లో నెలకొన్న ఉగ్ర సంక్షోభాన్ని నివారించే నిమిత్తం ఈ చర్చలను రష్యా నిర్వహిస్తోంది. చర్చలకు గాను ఇండియా, పాకిస్థాన్, అమెరికా,చైనాలతో పాటు పలు దేశాలను రష్యా ఆహ్వానించింది. ఈ సమావేశంలో తాలిబన్ నేతలు కూడా పాల్గొననున్నారు. రష్యన్ ఫెడరేషన్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.

ఈ చర్చల్లో భారత్ తరపున ఆఫ్ఘనిస్థాన్ లో భారత రాయబారిగా పని చేసిన అమర్ సిన్హా, పాకిస్థాన్ లో ఇండియన్ హై కమిషనర్ గా పని చేసిన టీసీఏ రాఘవన్ లు పాల్గొననున్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో శాంతిని నెలకొల్పడం కోసం భారత్ అన్ని విధాలా సహకరిస్తుందని ఈ సందర్భంగా రవీష్ కుమార్ తెలిపారు.

taliban
india
talks
russia
afghanistan
  • Loading...

More Telugu News