mangali krishna: మద్దెలచెరువు సూరి హత్య కేసు నిందితుడు మంగలి కృష్ణ కిడ్నాప్!

  • జూబ్లీహిల్స్ పీఎస్ లో మంగలి కృష్ణపై భూవివాదానికి సంబంధించిన కేసు నమోదు
  • బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
  • అనుచరులతో కలసి వెళ్తుండగా కిడ్నాప్

మద్దెలచెరువు సూరి హత్య కేసులో నిందితుడైన మంగలి కృష్ణను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, మంగలి కృష్ణపై భూవివాదానికి సంబంధించిన ఓ కేసు ఇటీవల హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. కేసు విచారణకు సంబంధించి ఈరోజు ఆయన నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.

 ఆయన వేసిన బెయిల్ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు... ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం తన అనుచరులతో కలసి ఆయన టీఎస్ 12సీపీ 1598 నంబరు గల వాహనంలో బయల్దేరారు. ఆయన వాహనాన్ని అనుసరించిన దుండగులు... ఆయన అనుచరులను కొట్టి, ఆయనను కిడ్నాప్ చేశారు. ఇదే విషయాన్ని ఆయన అనుచరులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

mangali krishna
maddelacheruvu suri
kidnap
hyderabad
  • Loading...

More Telugu News