note ban: నోట్ల రద్దును అటు చంద్రబాబు, ఇటు లోకేశ్ స్వాగతించారు.. మేం మాత్రమే వ్యతిరేకించాం!: పవన్ కల్యాణ్

  • చివరికి వైసీపీ కూడా దాన్ని సమర్ధించింది
  • పర్యవసానాలపై మేం మాత్రమే మాట్లాడాం
  • ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన జనసేన అధినేత

దేశంలో సామాన్యుల జీవితాలను చిదిమేసిన పెద్ద నోట్ల రద్దును కేవలం జనసేన పార్టీ మాత్రమే వ్యతిరేకించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ నోట్ల రద్దు ఐడియా తనదేనని చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారనీ, చివరికి ప్రతిపక్ష వైసీపీ కూడా దీన్ని స్వాగతించిందని వెల్లడించారు. ఓవైపు సామాన్యులు కష్టపడి సంపాదించిన తమ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు అల్లాడిపోతుంటే మరోవైపు చంద్రబాబు, లోకేశ్ బీజేపీని బహిరంగంగా సమర్ధించారని దుయ్యబట్టారు.

ఈ మేరకు పవన్ కల్యాణ్ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. రూ.1,000, రూ.500 నోట్ల రద్దు కారణంగా వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ జనసేన చేసిన పోరాటంపై మీడియాలో వచ్చిన కథనాల లింక్స్ ను పంచుకున్నారు. 2016, నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News