bihar: పెళ్లి ఎఫెక్ట్.. మానసిక ప్రశాంతత కోసం కాశీకి వెళ్లిపోయిన లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్!

  • ఆరు నెలల క్రితం ఐశ్వర్యారాయ్ తో పెళ్లి
  • పొసగకపోవడంతో విడాకులకు దరఖాస్తు
  • కుమారుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న తల్లి

తనకు బలవంతంగా పెళ్లి చేశారంటూ ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. భార్య ఐశ్వర్యారాయ్ తో జీవించడం తన వల్ల కాదంటూ ఆరు నెలలకే ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తేజ్ ప్రతాప్ మానసిక ప్రశాంతత కోసం కాశీ (వారణాసి)కి వెళ్లిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం తేజ్ ప్రతాప్ కాశీలోని ఓ అజ్ఞాత ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది.

జార్ఖండ్ లోని రాంచీలో ఉన్న బిర్సా ముండా జైలులో ఉన్న తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను కలుసుకున్న అనంతరం తేజ్ ప్రతాప్ ఇంటికి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో మనసు మార్చుకుని కాశీకి వెళ్లిపోయారు. మాజీ ముఖ్యమంత్రి దరోగారాయ్ మనవరాలైన ఐశ్వర్యారాయ్ ను తేజ్ ప్రతాప్ ఆరు నెలల క్రితం పెళ్లాడారు. విడాకుల విషయంలో కుమారుడి నిర్ణయాన్ని తల్లి రబ్రీ దేవీ తప్పుపడుతుండటంతో ఆమెపై తేజ్ ప్రతాప్ గుర్రుగా ఉన్నారు.

bihar
marriage
lalu prasad yadv son
tej pratap yadav
mental
peace
6 months
divorce
peacefull ness
RJD
angry
  • Loading...

More Telugu News