Telangana: నగరంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్: దాన కిశోర్

  • ఈ నెల 19న ఓటర్ల తుది జాబితా
  • పోలింగ్ కు రెండు, మూడు  రోజుల ముందే ఓటరు స్లిప్పుల పంపిణీ
  • వాహన తనిఖీల్లో రూ. 19 కోట్లను స్వాధీనం చేసుకున్నాం

ఈ నెల 19న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దాన కిశోర్ తెలిపారు. పోలింగ్ కు రెండు, మూడు రోజుల ముందే ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తామని చెప్పారు. హైదరాబాదులో 53 శాతంలోపే ఓటింగ్ నమోదవుతోందని అన్నారు. పోలింగ్ రోజున అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో, తనిఖీలను ముమ్మరం చేశామని... ఇప్పటి వరకు వాహనాల తనిఖీల్లో రూ.19 కోట్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 

Telangana
elections
voter list
polling
  • Loading...

More Telugu News