Telangana: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో జత కట్టిన కొత్త పార్టీ!

  • బీజేపీతో జతకట్టిన యువ తెలంగాణ పార్టీ
  • యువ తెలంగాణ పార్టీని స్వాగతిస్తున్నామన్న లక్ష్మణ్
  • ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ఉండదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలసి యువ తెలంగాణ పార్టీ పోటీ చేయబోతోంది. ఒకటి, రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, బీజేపీతో కలసి పోటీ చేయాలని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.

మహాకూటమికి ప్రజాదరణ లేదని, మహా ఓటమి దిశగా ఆ కూటమి సాగుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 2014 ఎన్నికల్లో పట్టిన గతే ఇప్పుడు కూడా పట్టబోతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ ఆయన స్థాయికి మించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ ఉనికి ఉండదని చెప్పారు.

Telangana
bjp
yuva telangana party
kcr
KTR
lakshman
TRS
congress
  • Loading...

More Telugu News