Gali Janardhan Reddy: సోదాలకు వెళ్లిన అధికారుల దిగ్భ్రాంతి... గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడల్లో సీక్రెట్ లాకర్లు!

  • గాలి ఇంట్లో తనిఖీలకు వెళ్లిన పోలీసులు
  • సీక్రెట్ లాకర్లు కనిపించాయని వెల్లడి
  • ఆయన అనుచరుడి ఇంట్లో పేలుడు పదార్థాల గుర్తింపు

ఈడీ అధికారికి లంచం ఇచ్చిన కేసులో గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులు షాకింగ్ నిజాలు తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు. ఆయన ఆచూకీ కోసం సీసీబీ పోలీసులు, ఇంట్లో తనిఖీలకు వెళ్లిన సమయంలో, ఇంటి గోడల మధ్య రహస్య లాకర్లు కనిపించాయని వెల్లడించారు. గోడల మధ్య ఉన్న లాకర్లలో ఏం దాచారన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

ఇదే సమయంలో గాలికి కుడిభుజంగా ఉండే అలీఖాన్ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులకు పేలుడు పదార్థాలు లభించాయి. ఈ విషయాన్ని వెల్లడించిన పోలీసులు, గాలి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. కాగా, ఆయన విదేశాలకు పారిపోయి ఉంటాడన్న అనుమానాలు తలెత్తిన సంగతి తెలిసిందే.

Gali Janardhan Reddy
Police
Secret Lockers
  • Loading...

More Telugu News