Andhra Pradesh: ఎవరు అడిగినా నా ఆస్తుల వివరాలు ఇస్తా.. తప్పు చేసుంటే ఎంక్వైరీ చేయాలని నేనే ఎందుకు లేఖ రాస్తా?: మంత్రి గంటా

  • నా ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కుట్ర
  • రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేకపోతున్నారు
  • విశాఖ భూ కుంభకోణంపై చర్చకు సిద్ధం

తన ఆస్తుల వివరాలు ఎవరు అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తన ఎదుగుదల చూడలేకే కొందరు నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఆస్తుల విలువ, ఇప్పుడు ఆస్తుల విలువ గురించి వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. విశాఖ భూ కుంభకోణం వ్యవహారంలో సిట్ దర్యాప్తులో తన నిర్దోషిత్వం బయట పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉంటానని గంటా శ్రీనివాసరావు తెలిపారు. తాను తప్పుచేయలేదన్న నమ్మకం ఉంది కాబట్టే సీబీఐ లేదా సిట్ వేసి విచారణ జరపాలని స్వయంగా సీఎంకు లేఖ రాశారన్నారు. తన ఇమేజ్ ను దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ఈ కుట్ర జరిగిందని గంటా ఆరోపించారు.

Andhra Pradesh
Ganta Srinivasa Rao
Visakhapatnam District
land scam
resign
assets
SIT
MP
open debate
  • Loading...

More Telugu News