Gali Janardhan Reddy: దేశం విడిచి పారిపోయిన గాలి జనార్దన్ రెడ్డి?

  • గాలి కోసం వెతుకుతున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
  • ఈడీ అధికారికి రూ. కోటి ఇచ్చినట్టు ఆరోపణ
  • రెండు రోజులు గడిచినా లభించని గాలి ఆచూకీ

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు, కర్ణాటక పోలీసులు ప్రత్యేక బృందాలతో మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికోసం గాలింపు జరుపుతున్న వేళ, ఆయన దేశం విడిచి పారిపోయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ మార్కెటింగ్ సంస్థ రూ. 600 కోట్లకు ప్రజలను మోసం చేయగా, ఈడీ కేసుల నుంచి సంస్థను బయట పడేయించేందుకు రూ. 18 కోట్లతో డీల్ కుదుర్చుకుని, కోటి రూపాయల లంచం ఇచ్చారన్నది గాలిపై ఆరోపణలు.

దీంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విస్తృత తనిఖీలు ప్రారంభించి, రెండు రోజులు గడిచినా, గాలి ఆచూకీ విషయమై ఒక్క వివరమూ సేకరించలేకపోయారు. తమ నేత ఎక్కడున్నారన్న విషయాన్ని ఆయన అనుచరులు, కుటుంబీకులు కూడా చెప్పడం లేదు. దీంతో ఆయన విజయ్ మాల్యా మాదిరిగా దేశం విడిచి వెళ్లి ఉండవచ్చని కొందరు పోలీసులు అనుమానిస్తున్నారు. గత మూడు నాలుగు రోజుల వ్యవధిలో విదేశాలకు వెళ్లిన వారి వివరాలను పరిశీలిస్తున్నారు.

Gali Janardhan Reddy
Flee
CCB Police
Karnataka
Raids
ED
  • Loading...

More Telugu News