Andhra Pradesh: తాడేపల్లిగూడెంలో టీడీపీ వర్సెస్ బీజేపీ.. 144 సెక్షన్ విధించిన అధికారులు!

  • అభివృద్ధిపై బహిరంగ చర్చకు సవాల్
  • మాణిక్యాల రావు, బాపిరాజుల మధ్య చర్చ
  • ఇద్దరినీ హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలో అభివృద్ధిపై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యాలరావు, జెడ్పీ చైర్మన్, టీడీపీ నేత ముళ్లపూడి బాపిరాజుల మధ్య సవాల్-ప్రతి సవాల్ తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అభివృద్ధిపై బహిరంగ చర్చకు వెంకటరామన్నగూడెంకు రావాలంటూ ఇరువర్గాలు సవాళ్లు విసురుకున్న నేపథ్యంలో పోలీసులు ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఇక్కడకు చేరుకున్న బాపిరాజును గృహ నిర్బంధం చేశారు.

సభలు, సమావేశాలకు అనుమతి లేనందున వెనక్కి వెళ్లిపోవాలని ఇరువురు నేతలకు అధికారులు సూచించారు. అయినా ఇరుపక్షాలు వినకపోవడంతో మాజీ మంత్రి మాణిక్యాలరావును సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇద్దరు నేతలకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు చేరుకున్న నేపథ్యంలో అధికారులు మాణిక్యాలరావు, బాపిరాజు నివాసాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య బహిరంగ చర్చ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది.

Andhra Pradesh
West Godavari District
tadepalligudem
manikyala rao
BJP
bapiraju
Telugudesam
development discuss
open debaste
  • Loading...

More Telugu News