Ajit: సెట్లో డ్యాన్సర్ హఠాన్మరణం... ఉదారత చూపిన హీరో అజిత్!

  • ప్రస్తుతం 'విశ్వాసం' సినిమాలో నటిస్తున్న అజిత్
  • పుణెలో పాట చిత్రీకరిస్తుండగా ఘటన
  • సొంత ఖర్చుతో మృతదేహం తరలింపు
  • డ్యాన్సర్ కుటుంబానికి రూ. 8 లక్షల సాయం

తమిళ దర్శకుడు శివ డైరెక్షన్ లో 'వీరం', 'వేదాలం', 'వివేగం' సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి, ఇప్పుడు 'విశ్వాసం'తో అజిత్ సిద్ధమవుతున్న వేళ, సినిమా షూటింగ్ సెట్లో విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం పుణెలో సినిమా పాట చిత్రీకరణ జరుగుతుండగా, నృత్య కళాకారుడు ఓవియన్‌ శరవణన్‌ హఠాన్మరణం చెందాడు.

గుండెపోటు వచ్చిన ఆయన, సెట్ లోనే కుప్పకూలగా, అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, ప్రాణాలు మిగల్లేదు. ఈ ఘటనను దగ్గరుండి చూసిన అజిత్, తన సొంత ఖర్చులతో మృతదేహాన్ని విమానంలో చెన్నైకి చేరేలా ఏర్పాట్లు చేశారట. ఆపై అతని కుటుంబానికి అండగా నిలుస్తానని చెబుతూ, తన వంతుగా రూ. 8 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి, తనలోని ఉదారతను చాటుకున్నాడు అజిత్.

Ajit
Viswasam
Shooting
Heart Attack
  • Loading...

More Telugu News