Gali Janardhan Reddy: అజ్ఞాతంలోకి వెళ్లిన 'గాలి' కోసం పోలీసుల మరో వేట!

  • ఈడీ అధికారికి కోటి రూపాయల లంచం
  • పక్కా సమాచారంతో పోలీసుల దాడులు
  • అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీములు

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారికి ఏకంగా కోటి రూపాయలు లంచం ఇచ్చారన్న అభియోగాలపై మైనింగ్ కింగ్, బళ్లారి బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం గాలి జాడ తెలియనప్పటికీ, సాధ్యమైనంత త్వరలో ఆయన్ను అరెస్ట్ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.  

ఓ సంస్థను ఈడీ విచారణ నుంచి బయట పడేసేందుకు ఈడీ అధికారినే బుట్టలో వేసుకున్న గాలి జనార్దన్ రెడ్డి, కోటి రూపాయలను లంచం ఇచ్చినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, నిన్నంతా ఆయన నివాసాలు, కార్యాలయాలపై దాడులకు దిగారు. పోలీసులు దాడికి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న గాలి అదృశ్యం కాగా, ఆయన జాడ తెలుసుకునేందుకు స్పెషల్ టీములు రంగంలోకి దిగాయి.

Gali Janardhan Reddy
ED
Bribe
Police
Raids
  • Loading...

More Telugu News