New Delhi: డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డిలను ఢిల్లీ పిలిపించుకున్న రాహుల్ గాంధీ!

  • ఇప్పటికే పలు స్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు
  • నేడు మరో 15 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక
  • స్క్రీనింగ్ కమిటీ ముందుకు పలువురు నేతలు

ఇప్పటికే పలు స్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం, ఇప్పుడు మిగిలిన అభ్యర్థులపైనా దృష్టిని సారించింది. నేడు మరో 15 స్థానాల్లో పోటీకి దిగే వారిని ఖాయం చేసేందుకు నిర్ణయించుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కీలకమైన కొన్ని స్థానాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకునేందుకు పలువురు నేతలను ఢిల్లీకి ఆహ్వానించారు. రాహుల్ ఆదేశాలతో కాంగ్రెస్ మహిళా నేతలు డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

వీరందరినీ స్క్రీనింగ్ కమిటీకి అందుబాటులో ఉండాలని పార్టీ ఆదేశించినట్టు తెలుస్తోంది. సూర్యాపేట, ములుగు, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, స్టేషన్ ఘనపూర్ తుంగతుర్తి, రాజేంద్రనగర్, దుబ్బాక, మెదక్ం పెద్దపల్లి, కోరుట్ల, వరంగల్ ఈస్ట్, కొత్త గూడెం, నిజామాబాద్ అర్బన్, రూరల్, మేడ్చల్, పటాన్ చెరు, జుక్కల్ తదితర స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక క్లిష్టమైన నేపథ్యంలోనే రాహుల్ స్వయంగా కల్పించుకుని ముఖ్య నేతలను కలవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

New Delhi
Rahul Gandhi
DK Aruna
Sabita Indrareddy
Congress
Telangana
Elections
  • Loading...

More Telugu News