Tamil Nadu: ఉప ఎన్నికల బరిలోకి కమలహాసన్.. 20 స్థానాల్లోనూ పోటీ చేస్తామన్న విలక్షణ నటుడు

  • ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్న కమల్
  • త్వరలోనే అభ్యర్థుల ప్రకటన
  • హర్షం వ్యక్తం చేస్తున్న అభిమానులు, కార్యకర్తలు

తమిళనాడులో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలతోపాటు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నట్టు నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ తెలిపారు. ఉప ఎన్నికలు జరగనున్న 20 స్థానాల్లో బరిలోకి దిగేందుకు కార్యాచరణ ప్రారంభించినట్టు చెప్పారు. త్వరలోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. కమల్ ప్రకటనతో అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.  

జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో టీటీవీ దినకరన్‌కు మద్దతు పలుకుతూ అటువైపు వెళ్లిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీనిని మద్రాస్ హైకోర్టు కూడా సమర్థించడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. అలాగే, కరుణానిధి, అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఏకే బోస్ మృతితో మరో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో మొత్తం 20 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

Tamil Nadu
Kamal Haasan
AIADMK
DMK
Elections
  • Loading...

More Telugu News