Khammam District: కుటుంబ కలహాలతో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

  • ఈ తెల్లవారుజామున ఘటన
  • కుటుంబ కలహాలతోనేనన్న పోలీసులు
  • కానిస్టేబుల్‌ను చర్లకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తింపు

కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ కానిస్టేబుల్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం 15 బెటాలియన్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ గురువారం తెల్లవారుజామున కణతకు తుపాకి గురిపెట్టి కాల్చుకున్నాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీనివాస్ మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Khammam District
Charla
Constable
Suicide
Telangana
  • Loading...

More Telugu News