Andhra Pradesh: కర్నూలులో కలకలం రేపిన రేవ్ పార్టీ.. అమ్మాయిల అశ్లీల నృత్యాల హోరు!

  • జిల్లాకు విస్తరించిన రేవ్ పార్టీ సంస్కృతి
  • ఫర్టిలైజర్స్ కంపెనీ డీలర్ల విందు
  • అశ్లీల నృత్యాలతో హోరెత్తిన పార్టీ

రేవ్ పార్టీ సంస్కృతి కర్నూలు జిల్లాకూ వ్యాపించింది. నగరాలకే పరిమితమైందని భావిస్తున్న వారికి అది తప్పని నిరూపించే మరో ఘటన జిల్లాలోని కల్లూరులో జరిగింది. గతంలో ఓ ఫర్టిలైజర్స్ కంపెనీకి చెందిన డీలర్లు రేవ్ పార్టీ నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. తాజాగా ఇటువంటి ఘటనే మరోటి అక్కడే జరగడం గమనార్హం.

ఓ ఫర్టిలైజర్ కంపెనీ డీలర్లు అందరూ కలిసి ఓ ఫంక్షన్ హాల్‌లో రేవ్ పార్టీ నిర్వహించారు. అమ్మాయిల అశ్లీల నృత్యాలతో పార్టీ హోరెత్తిపోయింది. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని డీలర్లు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించారు. విషయం వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పార్టీకి హాజరైన వారిని కలిసి ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

Andhra Pradesh
Kurnool District
Kallur
rave party
fertilizer dealers
  • Loading...

More Telugu News