Congress: చంద్రబాబు ప్రభుత్వంపై తులసిరెడ్డి ప్రశంసలు.. ఏపీలో టీడీపీతో పొత్తుపై ఇంకా తేల్చుకోలేదన్న కాంగ్రెస్ నేత

  • ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ముందుకు రావడం సంతోషం
  • దానిని ఎన్నికల హామీగా మార్చొద్దు
  • వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే

చంద్రబాబు ప్రభుత్వంపై ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమన్న ఆయన అది ఎన్నికల హామీగా మాత్రం మారకూడదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై మాట్లాడిన ఆయన ఏపీలో టీడీపీతో పొత్తు విషయమై ఇంకా చర్చలు జరగలేదన్నారు. ఈ విషయంలో అధిష్ఠానం నిర్ణయం మేరకే నడుచుకుంటామన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ నియంతలా మారి ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తున్నారని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సెయిల్ ఆధ్వర్యంలో కడపలో ఉక్కు పరిశ్రమను తామే నిర్మిస్తామని స్పష్టం చేశారు.

Congress
Tulasi Reddy
APCC
Telugudesam
Kadapa District
Andhra Pradesh
steel factory
  • Loading...

More Telugu News