indian railways: ఈ నెల 10న రెండు గంటలు ఆగిపోనున్న ఐఆర్ సీటీసీ వెబ్ సైట్.. ప్రకటించిన రైల్వేశాఖ!

  • నిర్వహణలో భాగంగా సేవలకు ఆటంకం
  • ఈ నెల 10న పలు సేవలకు అంతరాయం
  • అన్ని సర్వీసులు ఆగిపోతాయని వెల్లడి

భారత రైల్వేశాఖ ఈ రోజు కీలక ప్రకటన చేసింది. నిర్వహణ పనుల్లో భాగంగా రైల్వే శాఖ అధికారిక వెబ్ సైట్ irctc.co.in రెండు గంటల పాటు స్తంభించనుందని వెల్లడించింది. ఈ నెల 10వ తేదీన అర్థరాత్రి 12.20 నిమిషాల నుంచి తెల్లవారుజామున 1.30 వరకూ అన్ని సేవలు నిలిచిపోతాయని రైల్వేశాఖ పేర్కొంది. ఇలా నిలిచిపోనున్న సేవల్లో ఇంటర్ నెట్ బుకింగ్, ఫోన్ సర్వీసులు, ఇతర రిజర్వేషన్ సేవలు పనిచేయవని స్పష్టం చేసింది. కాబట్టి ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

indian railways
IRCTC
SERVICES
stopped
website
maintainence
booking
internet
phone services
all services
halted
2 hours
announced
  • Loading...

More Telugu News