Pawan Kalyan: ఎలుకలు ఏమైనా పడుతున్నారా?... పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన లోకేశ్!

  • వంతాడ గనులపై పవన్ ఆరోపణలు
  • ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
  • ఆధారాలుంటే బయట పెట్టాలని డిమాండ్

వంతాడ మైనింగ్ లీజ్ వివాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను ఏపీ ఐటీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ తిప్పి కొట్టారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టిన ఆయన, గనుల వివాదంపై పవన్ కల్యాణ్ కొండను తవ్వి ఎలుకను ఏమైనా పడుతున్నారా? అని అన్నారు.

గనుల తవ్వకంలో అక్రమాలు జరిగాయని పవన్ వద్ద సాక్ష్యాలుంటే, బయటకు చూపించి, తన ఆరోపణలను నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో పాలన సాగిస్తోందని, అనవసర, నిరాధార ఆరోపణలు చేయవద్దని లోకేశ్ హితవు పలికారు.

Pawan Kalyan
Nara Lokesh
Vantada Mining
Twitter
  • Loading...

More Telugu News