Deewali: హైదరాబాద్ ప్రజలపై పోలీసుల ఆంక్షలు... హద్దుమీరితే కేసులు పెట్టాలని ఉత్తర్వులు!

  • రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యనే దీపావళి
  • రెండు గంటలే టపాకాయలన్న సుప్రీం
  • హద్దు మీరితే సుమోటోగా కేసులు
  • అన్ని స్టేషన్లకూ ఉత్తర్వులు జారీ

సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, నేటి రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యనే ప్రజలు దీపావళి టపాకాయలు కాల్చుకునేలా చూడాలని హైదరాబాద్ నగర పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లకూ మెమోలు జారీ అయ్యాయి. గడువు దాటిన తరువాత పటాసులు పేల్చేవారిపై సుమోటోగా కేసులు పెట్టాలని కూడా ఈ మెమోల్లో ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నతాధికారులు.

టపాకాయల కారణంగా కాలుష్యం పెరిగి పోతుందన్న కారణంతో, సుప్రీంకోర్టు పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ప్రజలు పండగ జరుపుకునేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులు, కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. రెండు గంటల పాటు మాత్రమే టపాకాయలు కాల్చాలని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించేది లేదని ఇప్పటికే తమిళనాడు ప్రజలు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News