BJP: టికెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ నేత హుస్సేన్ నాయక్.. బీజేపీలో చేరిక!

  • కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన హుస్సేన్ నాయక్
  • లక్ష్మణ్ చేతుల మీదుగా బీజేపీ తీర్థం
  • బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఉదయం కాంగ్రెస్ నేతగా ఉన్న తెలంగాణలోని మహబూబాబాద్ నేత సాయంత్రానికి బీజేపీ నేతగా మారిపోయారు. కాంగ్రెస్ నేత జాటోతు హుస్సేన్ నాయక్ మహబూబాబాద్ నుంచి బరిలోకి దిగేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు మొండిచేయి చూపించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన మంగళవారం బీజేపీలో చేరిపోయారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. అవినీతి రహిత పాలన అందిస్తున్న మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయమన్నారు. దేశాభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు.

BJP
Congress
Telangana
Mahabubabad District
Jatotu Hussain Naik
  • Loading...

More Telugu News