Chandrababu: బీజేపీపై ఉన్న వ్యతిరేకతకు కర్ణాటక ఫలితాలే నిదర్శనం: సీఎం చంద్రబాబు

  • ఈ ఉపఎన్నిక ఫలితాలు బీజేపీకి శరాఘాతం
  • ఘోరంగా విఫలమైన బీజేపీ ప్రజలకు దూరమైంది
  • కుమారస్వామికి ఫోన్ చేసి అభినందనలు తెలిపిన బాబు 

ఈరోజు వెలువడ్డ కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు బీజేపీని షాక్ కు గురి చేయగా, కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి మంచి ఉత్సాహాన్ని నింపాయి. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామిని సీఎం చంద్రబాబు ఫోన్ చేసి అభినందించడం తెలిసిందే.

 తాజాగా, చంద్రబాబు మాట్లాడుతూ, ఈ ఉపఎన్నిక ఫలితాలు బీజేపీకి శరాఘాతమని, బీజేపీ పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకతకు కర్ణాటక ఫలితాలే అద్దం పడతాయని అన్నారు. కర్ణాటకలో ఘోరంగా విఫలమైన బీజేపీ ప్రజలకు దూరమైందని చెప్పడానికి ఇంత కన్నా నిదర్శనం ఇంకేం కావాలని అన్నారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు, తాజాగా జరిగిన ఉపఎన్నికలకు ఎంతో మార్పు కనిపించిందని, అహంభావంతో వ్యవహరించే వారికి ప్రజలే తగినబుద్ధి చెబుతారని చంద్రబాబు అన్నారు.

Chandrababu
kumaraswamy
bjp
Congress
  • Loading...

More Telugu News