Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన నెల్లూరు వైసీపీ నేత బొమ్మిరెడ్డి

  • బొమ్మిరెడ్డిని తీసుకెళ్లిన ఆదాల ప్రభాకర్ రెడ్డి 
  • ఏపీ సచివాలయంలో చంద్రబాబును కలిసిన వైనం
  • అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్న బొమ్మిరెడ్డి

నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆ పార్టీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని ఆయన ఈరోజు కలిశారు. నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయన్ని వెంటబెట్టుకుని ఏపీ సచివాలయానికి తీసుకువెళ్లారు. చంద్రబాబును కలిసి వారు చర్చించినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, గతంలో వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జిగా ఆయన వ్యవహరించారు. ఇదే నియోజకర్గానికి ఆనం రాంనారాయణరెడ్డిని ఇంఛార్జిగా నియమించినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో బొమ్మిరెడ్డి పాల్గొనడం తగ్గించారు. తమ కార్యకర్తలను, అనుచరులను సంప్రదించిన అనంతరం బొమ్మిరెడ్డి వైసీపీనీ వీడనున్నట్టు సమాచారం.

Chandrababu
nellore
YSRCP
bommireddy
  • Loading...

More Telugu News