revuri prakash reddy: హరీష్ రావు వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చిన టీటీడీపీ నేత

  • ఎదుటివారి జీవితాలతో ఆడుకోవడం హరీష్ కు అలవాటే
  • చంద్రబాబును తిట్టడం ద్వారా కేసీఆర్ మెప్పు పొందాలని భావిస్తున్నారు
  • టీఆర్ఎస్ నేతలు అహంకారం తలకెక్కి ప్రవర్తిస్తున్నారు

తన నాలుక కోస్తానంటూ మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేయాలని టీటీడీపీ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ లో ఆయన మాట్లాడుతూ, హరీష్ చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఎదుటి వారి జీవితాలతో ఆడుకోవడం హరీష్ కు మొదటి నుంచి అలవాటేనని విమర్శించారు. తమ అధినేత చంద్రబాబును తిట్టడం ద్వారా కేసీఆర్ మెప్పు పొందాలని హరీష్ భావిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు అధికారాన్ని కట్టబెడితే... టీఆర్ఎస్ నేతలు అహంకారం తలకెక్కి ప్రవర్తిస్తున్నారని అన్నారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News