Karnataka: విజయపథంలో కాంగ్రెస్, జేడీఎస్... ఓటమి దిశగా బీజేపీ!

  • బీజేపీకి షాక్ ఇస్తున్న ఉప ఎన్నికల ఫలితాలు
  • జామ్ ఖండి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఘన విజయం
  • మరో మూడు చోట్ల కాంగ్రెస్-జేడీఎస్ కూటమి భారీ ఆధిక్యం

కర్ణాటకలో మూడు లోక్ సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో... బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీని కన్నడ ఓటర్లు తిరస్కరించారు. జామ్ ఖండి అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఏఎస్ న్యామగౌడ తన ప్రత్యర్థిపై 39,480 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

మరోవైపు బళ్లారి లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప 2,14,826 ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు. మండ్య లోక్ సభ స్థానంలో జేడీఎస్ అభ్యర్థి శివరామేగౌడ 2,33,517 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రామానగర అసెంబ్లీ స్థానంలో ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య అనిత 1,05,294 ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు. శివమొగ్గ లోక్ సభ స్థానంలో మాత్రం బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర 47,388 ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు.

Karnataka
bye elections
results
bjp
congress
jds
  • Loading...

More Telugu News