roja: రోజా నా మీద ఎందుకు మండిపడుతున్నారో అర్థం కావడం లేదు: జేసీ దివాకర్ రెడ్డి

  • మళ్లీ సీఎం కావడానికి రాహుల్ తో కలవాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు
  • టీడీపీ అధికారంలోకి రావడానికి పార్టీకి ఉన్న బలం చాలు
  • మోదీని గద్దె దింపేందుకే కాంగ్రెస్ తో టీడీపీ స్నేహం

వైసీపీ ఎమ్మెల్యే రోజా తనపై ఎందుకు మండిపడుతున్నారో అర్థం కావడం లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సహాయంతో మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు అనుకుంటే ప్రజలు హర్షించరని చెప్పారు. మళ్లీ సీఎం కావడానికి రాహుల్ ను కలవాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని అన్నారు.

ఏపీలో మళ్లీ అధికారంలోకి రావడానికి టీడీపీకి ఉన్న బలం చాలని చెప్పారు. పొత్తుల కోసం, ఓట్ల కోసం ఆరాటపడాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించేందుకే కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలిపారని చెప్పారు. మహాకూటమిని ఏర్పాటు చేసి, కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతారని అన్నారు. స్వామి ప్రబోధానంద ఓ ఫ్యాక్షనిస్టని, ఆయనతో తనకు రాజీ ఏమిటని ప్రశ్నించారు.

roja
jc diwakar reddy
Chandrababu
Rahul Gandhi
  • Loading...

More Telugu News