Telangana: తెలంగాణ మహాకూటమిలో చేరిన మరో పార్టీ!

  • మహాకూటమిలో చేరిన ఆల్ ఇండియా ముస్లిం నేషనల్ లీగ్
  • ముస్లింలను కేసీఆర్ మోసం చేశారన్న పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఘనీ
  • టీఆర్ఎస్ ను ఓడించడమే తమ లక్ష్యమన్న నేత

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలోకి మరో పార్టీ వచ్చి చేరింది. ప్రస్తుతం ఈ కూటమిలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు ఉన్నాయి. తాజాగా, ఆల్ ఇండియా ముస్లిం నేషనల్ లీగ్ పార్టీ కూడా చేరింది. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ, మహాకూటమికి బేషరతుగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు.

రిజర్వేషన్ల విషయంలో ముస్లింలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ముస్లింలకు ఇచ్చిన హామీలను అటకెక్కించారని... తగిన నిధులను కూడా కేటాయించలేదని దుయ్యబట్టారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. ముస్లింలను మోసం చేసిన టీఆర్ఎస్ ను ఓడించడమే తమ లక్ష్యమని... అందుకే, మహాకూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. 

Telangana
mahakutami
all india muslim national league
  • Loading...

More Telugu News