mahakutami: టీజేఎస్ కు నియోజకవర్గాల జాబితాను అందజేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • పార్టీలో చర్చించి స్పందిస్తామన్న కోదండరామ్
  • ఢిల్లీకి బయల్దేరిన ఉత్తమ్, భట్టి, షబ్బీర్ అలీ
  • ఏఐసీసీ, ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల జాబితాపై తుది నిర్ణయం

తెలంగాణ మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. కూటమిలో భాగస్వామి అయిన టీజేఎస్ పార్టీకి కేటాయించాలనుకున్న నియోజకవర్గాల జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు. దీనిపై టీజేఎస్ అధినేత కోదండరామ్ మాట్లాడుతూ, పార్టీలో చర్చించిన తర్వాత జాబితాపై స్పందిస్తామని చెప్పారు.

మరోవైపు అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో నేడు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీలు ఢిల్లీకి పయనమయ్యారు. రేపు జరిగే ఏఐసీసీ, ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల జాబితాపై తుది నిర్ణయం తీసుకుంటారు. 

mahakutami
congress
tjs
cadidates list
Uttam Kumar Reddy
Kodandaram
Shabbir Ali
Mallu Bhatti Vikramarka
  • Loading...

More Telugu News