Narendra Modi: ప్రధాని మోదీ దీపావళి జరుపుకునేదిక్కడే!

  • కేదార్‌నాథ్‌లో దీపావళి జరుపుకోనున్న మోదీ
  • ఇప్పటి వరకు జవాన్లతో కలిసి జరుపుకున్నప్రధాని
  • నాలుగేళ్లూ వారితోనే..

దీపావళి పర్వదినాన్ని ప్రధాని నరేంద్రమోదీ కేదార్‌నాథ్‌లో జరుపుకోనున్నట్టు సమాచారం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్న మోదీ ఈసారి మాత్రం ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌లో జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

2014లో ఆయన ప్రధాని అయ్యాక సియాచిన్ బేస్ క్యాంపులో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. 2015లో అమృత్‌సర్‌లోని ఖాసాలో ఉన్న డొగ్రాయ్ యుద్ధ స్మారకం వద్ద జరుపుకున్నారు. 2016లో హిమాచల్‌ప్రసాద్‌లోని కిన్నౌర్ జిల్లాలో ఇండో-టిబెటిన్ సరిహద్దు వద్ద, గతేడాది జమ్ముకశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో సరిహద్దు భద్రతా సిబ్బందితో దీపావళి జరుపుకున్నారు. ఈసారి మాత్రం కేదార్‌నాథ్‌లో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News