Uttam Kumar Reddy: కోదండరామ్ తో చర్చలు ఫలప్రదంగా ముగిశాయి!: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • మహాకూటమి నుంచి ఎవరూ తప్పుకోవడం లేదు
  • రేపు ఢిల్లీ వెళుతున్నా
  • తిరిగొచ్చాక కూటమి అభ్యర్థులను ప్రకటిస్తా

హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ‘మహాకూటమి’ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరామ్ ల సమావేశం ముగిసింది. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ, కోదండరామ్ తో చర్చలు ఫలప్రదంగా ముగిశాయని చెప్పారు. సమావేశం నుంచి అర్ధాంతరంగా కోదండరామ్ వెళ్లిపోయారన్న వార్తలను ఈ సందర్భంగా ఉత్తమ్ ఖండించారు. సమావేశం ముగిసిన తర్వాతే ఆయన బయటకు వచ్చారని అన్నారు. మహాకూటమి నుంచి ఎవరూ తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉన్నందున రేపు ఢిల్లీ వెళుతున్నామని తెలిపారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.

కాగా, ఈ భేటీకి టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరుకాలేదు. సీట్లపై స్పష్టత ఉన్నందున తాను హాజరుకాలేదని రమణ, తమకు ఆహ్వానం లేకపోవడం వల్లే వెళ్లలేదని చాడ పేర్కొన్నారు.

Uttam Kumar Reddy
mahakutami
kodandaram
  • Loading...

More Telugu News