KCR: గవర్నర్‌తో కేసీఆర్ భేటీ.. రెండు గంటలపాటు సాగిన సమావేశం!

  • దీపావళి సందర్భంగా కలిశారంటున్న సీఎంవో వర్గాలు
  • రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న భేటీ
  • ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం వేడి మీదున్నాయి. డిసెంబర్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ఎత్తులకు పైఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రాజ్‌భవన్‌లో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దీపావళి పండుగను పురస్కరించుకుని కేసీఆర్.. గవర్నర్‌ను కలిశారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎప్పుడూ త్వరగా ముగిసే సమావేశం నేడు రెండు గంటలపాటు జరగడంతో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో ఇంతసేపు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.

KCR
Narasimhan
Meeting
Raj Bhavan
  • Loading...

More Telugu News