Jagan: జగన్‌కు పటిష్ట భద్రత.. బుల్లెట్ ప్రూఫ్ కారును ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం!

  • హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న జగన్
  • వైద్యుల సూచన మేరకు పాదయాత్ర వాయిదా
  • జగన్‌ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు

ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం తర్వాత తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఘటన అనంతరం హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్న ఆయన ప్రస్తుతం డాక్టర్ల సూచన మేరకు పాదయాత్రను వాయిదా వేసుకుని హైదరాబాద్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జగన్‌కు పటిష్ట భద్రతను కల్పించడమే కాకుండా... ఆయన ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జగన్‌కు బుల్లెట్ ప్రూఫ్ కారు‌ను ప్రభుత్వం కేటాయించింది.  

Jagan
Vizag
Airport
Telangana
Hyderabad
  • Loading...

More Telugu News