chada venkat reddy: రెండు మూడ్రోజుల్లో సీట్ల సర్దుబాటు తేలకుంటే 9 స్థానాల్లో మా అభ్యర్థులను ప్రకటిస్తాం: సీపీఐ నేత చాడ

  • ‘మహాకూటమి’లో ఇంకా సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదు
  • ఇంకా ఆలస్యమైతే సమస్యలు వస్తాయి
  • సీపీఐ పోటీ చేసే 9 స్థానాల్లో ప్రతిపాదనలు పెట్టాం

‘మహాకూటమి’లో పొత్తుల వ్యవహారం రెండుమూడ్రోజుల్లో తేలకుంటే 9 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మహాకూటమి’లో ఇంకా సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదని, సీట్ల సర్దుబాటు త్వరగా పూర్తి కావాలని, ఇంకా ఆలస్యమైతే సమస్యలు వస్తాయని అన్నారు. సీపీఐ పోటీ చేసే 9 స్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థుల ప్రతిపాదనలు పెట్టామని చెప్పారు. హుస్నాబాద్, బెల్లంపల్లి, పినపాక, ఆలేరు, దేవరకొండ, వైరా, మునుగోడు, కొత్తగూడెం, మంచిర్యాల స్థానాలకు సంబంధించి సీపీఐ అభ్యర్థుల ప్రతిపాదనలు పెట్టామని అన్నారు. 

chada venkat reddy
mahakutami
cpi
  • Loading...

More Telugu News