Adireddy Appa Rao: టీడీపీ పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు

  • ఏపీపై కేంద్రం కుట్రలు పన్నుతోందంటూ పాదయాత్ర
  • అప్పారావును ఆసుపత్రికి తరలించిన కార్యకర్తలు
  • ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని.. హోదా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. దీనిలో భాగంగా రాజమండ్రిలో జరిగిన పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అక్కడే ఉన్న కార్యకర్తలు వెంటనే ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని టీడీపీ వర్గాలు తెలిపాయి.

Adireddy Appa Rao
Andhra Pradesh
Central government
Rajahmundry
  • Loading...

More Telugu News