Andhra Pradesh: ‘జనతా గ్యారేజ్’ పేరుతో సెటిల్మెంట్లు, గుంటూరులో కత్తితో యువకుడి హల్ చల్!

  • యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఘటన
  • జనతా గ్యారేజ్ పేరుతో వాట్సాప్ గ్రూపు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' సినిమాను స్ఫూర్తిగా తీసుకున్న ఓ ఆకతాయి రెచ్చిపోయాడు. ఓ వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేయడంతోపాటు ఎవరికైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తానని చెప్పడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా చేతితో కత్తి తీసుకుని నడి రోడ్డులో హల్ చల్ చేశాడు. చివరికి స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

జనతా గ్యారేజ్ సినిమాతో స్ఫూర్తి పొందిన ప్రదీప్ అనే యువకుడు తాడేపల్లి మండలం ఉండవల్లిలో రోడ్డుపై చేతిలో కత్తితో హల్ చల్ చేశాడు. ఇతను జనతా గ్యారేజ్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి ఎవరికైనా సమస్యలుంటే సెటిల్ చేస్తానని ప్రచారం చేస్తున్నాడు. గతంలో ఇతను పలు నేరాలకు పాల్పడినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రదీప్ ఉండవల్లిలో కత్తిని పట్టుకుని గట్టిగా ఫోన్ లో మాట్లాడుతూ కనిపించాడు. దీంతో స్థానికులు ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్న అధికారులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

  • Error fetching data: Network response was not ok

More Telugu News