ke krishnamurthy: పార్టీ సిద్ధాంతం కన్నా దేశ శ్రేయస్సే నాకు ముఖ్యం: కేఈ కృష్ణమూర్తి

  • దేశానికి బీజేపీ ప్రమాదకరం
  • మోదీని ఎదుర్కోవడానికే మహాకూటమి
  • మిత్రుడు శత్రువైనప్పుడు.. శత్రువు మిత్రుడు కావడంలో తప్పేముంది

కాంగ్రెస్ పార్టీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పెట్టిన పార్టీ టీడీపీ అనడంలో సందేహం లేదని... కానీ, పార్టీ సిద్ధాంతాలు ముఖ్యమా? లేక దేశ శ్రేయస్సు ముఖ్యమా? అని అడిగితే... దేశ శ్రేయస్సుకే తాను ఓటు వేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు.

మిత్రులుగా భావించిన వారు శత్రువులుగా మారినప్పుడు... శత్రువులు మిత్రులుగా మారడంలో తప్పేముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కన్నా బీజేపీనే దేశానికి ప్రమాదకరమని చెప్పారు. దేశంలోని కీలక వ్యవస్థలను నాశనం చేస్తున్న మోదీని ఎదుర్కోవడానికే జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పడుతోందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు విభిన్నమైన సిద్ధాంతాలు కలిగిన పార్టీలన్నీ ఏకమవుతున్నాయని చెప్పారు. ఇందులో భాగమే కాంగ్రెస్, టీడీపీల కలయిక అని అన్నారు.

ke krishnamurthy
mahakutami
Telugudesam
congress
bjp
modi
  • Loading...

More Telugu News