Andhra Pradesh: ఈరోజు నుంచి నేను రెల్లి కులస్తుడిని.. మీ దుస్థితిని చూసి వెక్కివెక్కి ఏడ్వాలని ఉంది!: పవన్ కల్యాణ్

  • మీరంతా ఆర్థికంగా బలపడాలి
  • అందుకు జనసేన అండగా ఉంటుంది
  • నాకు కులమతాల పట్టింపు లేదు

రెల్లి సామాజికవర్గం దుస్థితిని చూసి తనకు వెక్కివెక్కి ఏడ్వాలని అనిపిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ రోజు నుంచి రెల్లి కులస్తుడినేననీ, అందరికీ అండగా ఉంటానని అన్నారు. రెల్లి కులస్తుల బాధలు ఇకపై తన బాధలనీ, తనకు ఎలాంటి మతం లేదని స్పష్టం చేశారు.

అణగారిన కులాల్లో కూడా అణగారిన వర్గం రెల్లి కులమని పవన్ కల్యాణ్ అన్నారు. ఇల్లు ఇద్దెకు ఇవ్వమని బ్రతిమాలడం కాకుండా, స్వయంగా తమ ఇళ్లను ఇతరులకు అద్దెకు ఇచ్చే స్థాయికి రెల్లి కులం ఆడబిడ్డలు ఎదగాలని ఆకాంక్షించారు. తూర్పుగోదావరి జిల్లాలో పోరాట యాత్రలో భాగంగా పర్యటిస్తున్న జనసేన అధినేత ఈ రోజు రెల్లి సామాజికవర్గం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ రెల్లి సామాజికవర్గానికి జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రెల్లి సామాజికవర్గం స్వయంకృషితో, తమ కాళ్లపై తాము నిలబడేలా చర్యలు తీసుకుంటానని పవన్ అన్నారు. పారిశుద్ధ్య పనులు చేపడుతున్న రెల్లి సామాజికవర్గం మనస్సు చాలా గొప్పదనీ, ఇప్పటి నుంచి ఈ సామాజికవర్గం గొంతుగా తాను మారుతానని జనసేనాని స్పష్టం చేశారు.

Andhra Pradesh
East Godavari District
Janasena
porata yatra
Pawan Kalyan
relly community
meeting
  • Loading...

More Telugu News