vaishnav tej: సాయిధరమ్ తేజ్ తమ్ముడి సరసన నిధి అగర్వాల్

  • హీరోగా వైష్ణవ్ తేజ్ 
  • దర్శకుడిగా బుచ్చిబాబు 
  • త్వరలోనే షూటింగు మొదలు    

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్, తొలినాళ్లలోనే మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో ఆయనకి సరైన హిట్ పడలేదు. హిట్ కొట్టడం కోసం తేజు నానాతంటాలు పడుతుండగానే, ఆయన తమ్ముడు వైష్ణవ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే నటనలోను . . డాన్స్ .. ఫైట్స్ లోను శిక్షణ తీసుకున్న వైష్ణవ్ తేజ్, త్వరలో సెట్స్ పైకి వెళ్లడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు.

సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించి, ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ వున్న కారణంగా నిధి అగర్వాల్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. మొత్తానికి నిధి అగర్వాల్ అక్కినేని కాంపౌండ్ లో నుంచి మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిందన్న మాట.       

vaishnav tej
nidhi
  • Loading...

More Telugu News