amrica: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు షాక్.. ఏకంగా లీగల్ నోటీసులు పంపిన గాయని రిహాన్నా!

  • టెన్నెస్సో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్
  • ర్యాలీ సందర్భంగా రిహాన్నా పాట ప్రదర్శన
  • ట్రంప్ తీరుపై తీవ్రంగా మండిపడ్డ గాయని

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పాప్ గాయని రిహాన్నా షాకిచ్చింది. అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారం సందర్భంగా ర్యాలీలో తన పాటను వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు పంపింది. టెన్నెస్సోలోని చట్టనూగలో నిన్న నిర్వహించిన రిపబ్లికన్ పార్టీ ర్యాలీలో రిహాన్నా పాడిన ‘డోన్ట్ స్టాప్ ది మ్యూజిక్’ గీతాన్ని నిర్వాహకులు ప్రసారం చేశారు. దీంతో ట్విట్టర్ సాక్షిగా ట్రంప్, ఆయన అనుచరులపై రిహాన్నా మండిపడింది.

‘ఇలాంటి ద్వేషపూరితమైన ర్యాలీల్లో నేను కానీ, నా అభిమానుల కానీ పాల్గొనరు. ట్రంప్‌.. మీ ర్యాలీల్లో నా పాటలేంటి?’ అని అని దుయ్యబట్టింది. తన అనుమతి లేకుండా తన ఆల్బమ్స్‌ను ప్రసారం చేసినందుకు సదరు నిర్వాహకులకు రిహాన్నా లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన ఫిలిప్ రక్కర్ అనే నెటిజన్ కు ధన్యవాదాలు తెలిపింది.

amrica
USA
Donald Trump
president
angry
criticise
rihanna
pop singer
election rally
tennesso
leagl notice
song
mis use
dont stop the music
  • Loading...

More Telugu News