Chandrababu: చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది: టీకాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

  • హరీష్, కేటీఆర్ లపై మండిపడ్డ జీవన్ రెడ్డి
  • చంద్రబాబును విమర్శించే ముందు మీరేం చేశారో చెప్పాలంటూ ప్రశ్న
  • చంద్రబాబు, కోదండరామ్, గద్దర్, విమలక్కలాంటి వారు చేతులు కలపడం శుభపరిణామం

తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. 'మీరా చంద్రబాబుపై విమర్శలు చేసేది?' అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును విమర్శించే ముందు తెలంగాణకు మీరేం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఒక కుటుంబం యొక్క అరాచక పాలనను అంతమొందించేందుకే మహాకూటమి ఏర్పడిందని చెప్పారు. చంద్రబాబు, కోదండరామ్, గద్దర్, విమలక్కలాంటి వారంతా ఒక్కటి కావడం శుభపరిణామమని అన్నారు. అందరూ కలసి కేసీఆర్ ను గద్దె దింపుతారని చెప్పారు. జగిత్యాలలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

Chandrababu
KTR
Harish Rao
Jeevan Reddy
gaddar
kodandaram
  • Loading...

More Telugu News